Nayanthara : ట్విన్స్‌కు జ‌న్మ‌నిచ్చిన న‌య‌న‌తార – విఘ్నేష్ శివ‌న్‌

Advertisement

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుసు కదా. తన ప్రియుడు విఘ్నేష్ శివన్ (vignesh shivan) ను ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లు దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత గత జూన్ లో మహాబలేశ్వరంలో వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రముఖ సెలబ్రిటీల సమక్షంలో నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నయనతార ప్రస్తుతం ఇద్ద‌రు పండంటి ట్విన్స్‌కు జ‌న్మ‌నిచ్చారు.

Advertisement

ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు పుట్టార‌ని విగ్నేష్ శివ‌న్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా న‌య‌న‌తార విఘ్నేష్ ఇద్దరు పిల్ల‌ల పాదాలు ఫొటోలు షేర్ చేశారు. మా త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ పుట్టార‌ని వారి ఆశీర్వాదాలు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని తెలిపారు. నెటిజ‌న్లు మాత్రం నిన్న‌గాక‌మొన్న‌నే వారికి పెళ్లి అయ్యింది అప్పుడే పిల్ల‌లేంటి ఆని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఈ మ‌ధ్యే రిలీజ్ అయిన గాడ్‌ఫాద‌ర్ సినిమాలో కూడా స‌త్య‌దేవ్ భార్య‌గ న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఆ సినిమాలో కూడా త‌ను ప్రెగ్నెంట్ అన్న‌విష‌యం కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. నెటిజ‌న్లు మాత్రం న‌య‌న్ విఘ్నేష్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ తెగ సంబుర‌ప‌డిపోతున్నారు.

Advertisement
Nayanthara and Vignesh couple blessed with twins
Nayanthara and Vignesh couple blessed with twins

Nayanthara : సిల్వర్ స్క్రీన్ పై ఇక నయనతార కనిపించదా?

న‌య‌న‌తార అభిమానులు మాత్రం ఇక‌పై సినిమాలో కనిపిస్తుందా లేదా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. న‌య‌న్ మాత్రం మా పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ అందిచాల‌నే కోరిక ఉంది. వారితో గ‌డ‌పాల‌ని ఉంది. వాళ్ల బాల్యం మొత్తం నాతో గ‌డ‌పాల‌ని కోరుకుంటుంద‌ట‌. వారికోసం నా కెరియ‌ర్‌ను ఆపేస్తాను. వారి భ‌విష్య‌త్తే నాకు ముఖ్యం అన్న‌ట్లుగా తెలిపారు. పిల్ల‌లు పెద్ద అయ్యాక తిరిగి మ‌ళ్లీ సినిమాలు ప్రారంభిస్తార‌ని తెలుస్తుంది.

Advertisement