Nayanthara : గత కొద్ది రోజులుగా నయనతార విఘ్నేష్ శివన్‌లకి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు అక్టోబర్ 9న ట్విన్స్ బేబీ బాయ్స్ ఉయిర్, ఉలగమ్ కు జన్మనిచ్చారు . ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితు ఈ శుభవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో నయన్ దంపతులను ఆశీర్వదించారు. తర్వాత పెళ్లయిన నాలుగు నెలలకే ఎలా జన్మనిచ్చారన్న వార్తలు తెగ హైలెట్ అయ్యాయి. సరోగసీ ద్వారానే వారు పిల్లలకు జన్మినిచ్చారని తెలిసి తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది.
నయనతార, విఘ్నేష్ శివన్‌లు కవలపిల్లల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని ఆ కమిటీ స్పష్టం చేసింది . ఈ జంటకు పెళ్లి 2016లో జరిగిందని,.. 2021 నవంబర్‌లో సరోగసికి సంబంధించి అగ్రిమెంట్ జరిగిందని పేర్కొంది కమిటీ. దీంతో స్టార్ కపుల్ నయన్, విఘ్నేష్‌లు సరోగసి యాక్ట్‌ను ఎక్కడ ఉల్లంఘించలేదని తెలిపింది. దీంతో నయన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఒక వీడియోను విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోలో తమ పిల్లల ముఖాలను మాత్రం చూపించలేదు. ఇటీవల సెలబ్రిటీలు తమ పిల్లల మొహాలను చూపించకుండా ఊరిస్తున్న విషయం తెలిసిందే.

Nayanthara : ఇబ్బందులు తొలగిపోయాయి..
ఇక నయన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీలకపాత్రలో కనిపించారు నయనతార. ఈ సినిమాతో పాటు ఆమె ఓ రెండు సినిమాల్లో చేస్తున్నారు. షారుక్ ఖాన్ ‘జవాన్’తో పాటు, పృథ్వీరాజ్ ‘గోల్డ్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శనకు రానుంది. దీనికి నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరు పెట్టారు. నయనతార తమిళ్లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు