Nayanthara : కోలీవుడ్ ప్రేమ జంట నయనతార విఘ్నేష్ శివన్ గత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తున్నారు. సరోగసీతో కవలలకు జన్మనిచ్చి, విమర్శలు ఎదుర్కొంటున్న నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పెళ్లయిన నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులయ్యారు. దీంతో వీరిపై విమర్శలు ఎక్కువయ్యాయి. అక్టోబర్ 9న ట్విన్స్ బేబీ బాయ్స్ ఉయిర్, ఉలగమ్ కు జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్త అందించారు. ఈ శుభవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో నయన్ దంపతులను ఆశీర్వదించారు. వివాహమైన 4 నెలలకే పిల్లలు పుట్టడం ఏంటనే చర్చ జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె సరోగసి ద్వారా పిల్లలను కనిందని కన్ఫర్మ్ చేసుకున్నారు
దీంతో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులు నిబంధనలకు లోబడే సరోగసిని ఉపయోగించారా అని విషయాన్ని తెలియజేయాల్సిందిగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నయనతార తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో నయనతార కీలక విషయాలను వెల్లడించింది. విగ్నేష్, తాను ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని.. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆ అఫిడవిట్‌కు జత చేసి నయనతార పంపింది. సాధారణంగా సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే పెళ్లి ఆయి ఐదేళ్ళు అయ్యి ఉండాలి. ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం కలిగి ఉండాలి .అప్పుడే సరోగసిని లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు .

Nayanthara : సేవ్ అయినట్టేనా..
ఈ విషయాల గురించి కాస్త అవగాహాన తెచ్చుకున్న నయనతార విగ్నేశ్..మాకు ఆరేళ్ల ముందే పెళ్లి అయ్యిందంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ ను తమిళనాడు గవర్నమెంట్ కి అందజేశారు. అంతేకాదు నయనతార కి ప్రాబ్లం ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు .దీంతో వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డట్టు అయింది. లేదంటే ఐదేళ్లు జైలు శిక్ష పడేదని అంటున్నారు. సరోగసి నియంత్రణ చట్టం 2021 డిసెంబర్ లో ఆమోదించబడింది. భారతదేశంలో 2022 జనవరి 25 నుంచి అమలులోకి వచ్చింది. ఇది వాణిజ్య సరోగసిని నిషేధించింది. పరోపకార అద్దె గర్భాన్ని అనుమతిస్తుంది.