Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాదరణ పొందిన నయనతార జూన్‌లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
కొందరు ఇది బ్యాన్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది. అయితే పెళ్లైన దగ్గర నుండి నయనతారని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తిరుమలలో చెప్పులతో ఫొటో షూట్ చేసిందని, వెడ్డింగ్ సంబంధించిన కవరేజ్‌ని నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చిన విషయంలోను పెద్ద వివాదమే నడిచింది. ఇప్పుడు సరోగసి ద్వారా ఈ దంపతులు లేని పోని సమస్యలలో ఇరుక్కును అవకాశం ఉందని అంటున్నారు. ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇదంతా ప్రభుదేవా భార్య శాపం వల్లనే జరిగిందా అని ముచ్చటించుకుంటున్నారు. ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ నయనతారను అప్పట్లో ఓ రేంజ్ లో బూతులు తిట్టింది.

Nayanthara : శాపమే కారణమా?
” అది ఆడదేనా అంటూ మండిపడింది.. నువ్వు సర్వం నాశనం అవుతావు అంటూ మీడియా ముందే శాపనార్ధాలు పెట్టింది . నీకు నా ఉసురు తగలకుండా పోదు.. నా కన్నీటికి నువ్వే కారణం.. నా జీవితాన్ని నాశనం చేసేసావు.. నా భర్త నానుంచి దూరం చేస్తున్న నయనతార అరెస్ట్ చేయాలి ..చట్టాలు కఠినంగా శిక్షించాలి ..”అంటూ ఆమెను దుష్ట శక్తి అంటూ పోల్చింది రమాలత్. అయితే ప్రజెంట్ ఆమె గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. తొలిదశ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అయితే నయన్, విగ్నేష్ లని కూడా విచారణకి పిలుస్తారు.