Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ కాగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా అతడిని పెళ్లాడింది. ఇక అప్పటి నుండి ఈ జంట తెగ సందడి చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ బర్త్ డే సందర్భంగా బుర్జ్ ఖలిఫా వద్ద సందడి చేశారు.
పెళ్లి తర్వాత భర్త విఘ్నేష్ శివన్ సెలబ్రేట్ చేసుకుంటోన్న తొలి పుట్టినరోజు కావటంతో నయనతార చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. భార్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి విఘ్నేష్ శివన్ ఎంతో హ్యాపీగా ఫీలవుతూ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘నా భార్య నయనతార అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. నన్నెంతో ప్రేమించే వ్యక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలను బుర్జ్ ఖలీఫా దగ్గర సెలబ్రేట్ చేసుకోవటం ఒక డ్రీమ్‌లా అనిపిస్తుందని, ఇలాంటి మరచిపోలేని క్షణాలను అందిచినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని విఘ్నేష్ చెప్పుకొచ్చాడు.

Nayanthara : అంత సంపాదించిందా?
అయితే లేడి సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార ఏకంగా రూ.165కోట్లు సంపాదించిన ఉంటుందని సమాచారం. ఆదాయపన్ను శాఖకి నయనతార సమర్పించిన పత్రాల్లో ఈ మొత్తం ఆస్తుల వివరాలు తెలిపినట్టు సమాచారం. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే నయనతార ఆ మాత్రం సంపాదించి ఉంటుందని అందరు భావిస్తున్నారు. ఈవిడకి హైదరాబాద్‌తో పాటు ఇండియాలోని పలు నగరాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్లు, ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ ధర పది కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఏదేమైన నయన్ ఆస్తుల చిట్టా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.