Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుసు కదా. తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లు దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత గత జూన్ లో మహాబలేశ్వరంలో వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రముఖ సెలబ్రిటీల సమక్షంలో నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నయనతార ప్రస్తుతం బిడ్డను కనాలని అనుకుంటోందట. దాని కోసం ప్లానింగ్ చేసుకుంటోందట. తల్లి కావాలని నయనతార ఆశ పడుతోందట. అందుకే నయనతార ఒక కఠిన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతానికి తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేస్తోంది. చాలామంది దర్శకనిర్మాతలు వచ్చి తమ సినిమాలో నటించాలని అడుగుతున్నా తను సున్నితంగా తిరస్కరిస్తోంది. తల్లి కావాలని అనుకోవడం మంచిదే కానీ..

Nayanthara : సిల్వర్ స్క్రీన్ పై ఇక నయనతార కనిపించదా?
ఒకవేళ తను సినిమాలు ఒప్పుకోకపోతే.. తను తల్లి అయ్యాక సినిమాలు చేస్తుందా? లేక సినిమాలు ఆపేస్తుందా? చాలామంది హీరోయిన్లు తాము తల్లి అయ్యాక సినిమా కెరీర్ నే ఆపేశారు. ఇప్పుడు నయనతార కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా? అలా అయితే నయనతారను ఇక సిల్వర్ స్క్రీన్ మీద చూడలేమా? ఇక తను ఇప్పుడు నటించే సినిమాలే తన చివరి సినిమాలా? అంటూ తన అభిమానులు మాత్రం తెగ భయపడిపోతున్నారు. ఏది ఏమైనా.. నయనతార తల్లి కావాలని అనుకోవడం మంచిదే కానీ.. తను ఇక సినిమాలకు దూరం అయితే ఎలా అని తన అభిమానులు బాధపడుతున్నారు.