Nayanthara : మహానటి సావిత్రి ,,,ఈ పేరు అంటే తెలియని తెలుగు వారు ఉండరు .తన నటనతో తెలుగు సిని పరిశ్రమలో చెరగని స్థాయిని సంపాదించుకుంది.తన డేట్స్ కోసం సీనియర్ NTR ,అక్కినేని నాగేశ్వరరావు సైతం వెయిట్ చేసేవారు .అంతటి మహోన్నత విజయం అందుకున్న ఒక్కే ఒక్క హీరోహిన్ సావిత్రి అనడం లో అతిషయొక్తి లేదు . కెరియర్ పరంగా సావిత్రి ఎంత సక్సెస్ నీ అందుకుందో తన రియల్ లైఫ్ లో అంతే ఫెయిల్యూర్ అయిన విషయం అందరికి తెలిసిందే . తన కెరియర్ స్టార్టింగ్ స్టేజి లోనే జెమిని గణేష్ తో ప్రేమ లో పడింది .ఎవరు చెప్పిన వినకుండ జెమిని గణేష్ తో ఏడు అడుగులు వెసి రెండో భార్య గా జెమిని గణేష్ ఇంటికి వెళ్లి , తన కెరియర్ పతనానికి మొదటి అడుగు వేసింది.
జెమినీ గణేష్ ప్రేమ మత్తు లో పడి తన లైఫ్ ని తనే నాశనం చేసుకుంది. అయితే అప్పుడు మహానటి సావిత్రి ఎలా తప్పటడుగులు వేసిందో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోహిన్ నయనతార కూడా అలాగే తప్పటడుగులు వేస్తుంది అని నేటి జనాలు అంటున్నారు . నయనతార ఈ మధ్యనే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది .చాలాకాలం గా ప్రేమ లో ఉన్న ఈ జంట రీసెంట్ గా జూన్ 9 న తమిళనాడు లోని మహాబలిపురం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు .అలాగే ఇప్పటికి 2 హానీమూన్ ట్రిప్ లని కంప్లీట్ చేసుకుని 3వ హానీమూన్ ట్రిప్ కి సిద్ధం అవుతున్నారట .ఇది ఇలా ఉండగా తాజాగా నయనతార తీసుకున్న నిర్ణయం కోలీవుడ్ లో ట్రేండింగ్ గా మారింది.

తను ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆస్థి నీ తన అమ్మ పేరిట సగం తన భర్త పేరిట సగం రాయాలని నిర్ణయించుకుందంట. నా జీవితం లో ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వీరే అందుకే ఈ నిర్ణయం తీసుకున్న అని చెప్పుకొచ్చింది అంట నయనతార. అయితే ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న చాలా మంది కొద్దిరోజులకే విడిపోతున్నారు .ఇలాంటి టైం లో నయనతార తీసుకున్న నిర్ణయం కర్రెక్ట్ కాదు అంటూ తన అభిమానులు మండిపడుతున్నారు .నయనతార తన నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది అని …. లేకపోతే మహానటి సావిత్రి ల తను కావాల్సి ఉంటుంది అని అంటున్నారు . మరి చూడాలి నయనతార తన నిర్ణయం ని మార్చుకుంటదో లేదో ?