Bigg Boss : ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కేవలం హిందీ బిగ్ బాస్ మాత్రమే. కానీ.. ఇప్పుడు అన్ని భాషల్లో బిగ్ బాస్ ప్రత్యక్షం అయింది. మన తెలుగులో కూడా ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఓటీటీ సీజన్ కూడా విజయవంతంగా పూర్తయింది. అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ సూపర్ డూపర్ గా నడుస్తోంది. అయితే.. ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఎక్కువ వివాదాలు బిగ్ బాస్ చుట్టుముడుతున్నాయి.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దర్శకుడిని బయటికి పంపించేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ 16 ప్రారంభం అయింది కదా. అందులో వివాదాస్పద డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా ఉన్నాడు.
బిగ్ బాస్ 16 లో కంటెస్టెంట్ గా ఉన్న సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పించాలంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. సాజిద్ ఖాన్ మీటూ కేసులో అప్పట్లో ఇరుక్కున్నాడు. ఆయన చాలామంది హీరోయిన్లను లైంగికంగా వేధించాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. హీరోయిన్లపై వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని ఎలా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు కూడా వెంటనే సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించాలని అంటున్నారు. అయితే.. ఇప్పటికే సాజిద్ ఖాన్ ఓ ఏడాది పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నిషేధానికి గురయిన విషయం తెలిసిందే. ఏడాది గడిచాక మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

Bigg Boss :మీటూ కేసులో ఇరుక్కున్న సాజిద్ ఖాన్
ఇప్పుడు బిగ్ బాస్ లో చేరాడు. షోకు కూడా మంచి రేటింగ్స్ వస్తుండటంతో బిగ్ బాస్ కూడా కామ్ గా ఉంటున్నాడు. చివరకు హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా సాజిద్ ఖాన్ విషయంలో ఏ విధంగానూ స్పందించలేదు. మరోవైపు నెటిజన్లు ఆయన్ను షో నుంచి బయటికి తరిమేయాలంటూ సోషల్ మీడియాలో యుద్ధాన్నే ప్రకటించారు. అయినా కూడా బిగ్ బాస్ టీం మాత్రం అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. చూద్దాం మరి.. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కదా. అందుకే సాజిద్ ఖాన్ ను అసలు షో నుంచి తప్పిస్తారా లేదా అని.