Niharika : మెగా బ్రదర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు టీవీ షోస్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇలా పలు రకాలుగా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అంతగా సక్సెస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని మళ్లీ ఇప్పుడు నిర్మాతగా బిజీ అవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో నిహారిక ఆరబోసే అందాలు కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి మత్తెక్కిపోతున్నారు. అయితే తాజాగా నిహారికకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.
మెగా డాటర్ నిహారికను యంగ్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట.ఆమెతో కలిసి ఓ సినిమా చేయగా, ఆ సమయంలో నిహారిక ప్రేమలో పడ్డాడట. ఇక ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. నిహారికను సదరు హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని, మెగా అల్లుడు కాబోతున్నాడని వార్తలు రాగా, నాగబాబు మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యాడు. నిహారిక కు అప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని.. ఆ టైంలో చెప్పుకొచ్చాడు”. అంతేకాదు మరోసారి ఆ యంగ్ హీరోతో నటించకుండా నిహారికను దూరం పెట్టారట. ఇక కొద్ది సంవత్సరాల క్రితం చైతన్య అనే వ్యక్తిని వివాహమాడిన నిహారిక ప్రస్తుతం అతనితో వైవాహిక జీవితం గడుపుతుంది.

Niharika : సోషల్ మీడియా రూమర్స్..
నిహారిక, చైతన్యల పెళ్లి అంగరంగ వైభవంగా రాజుల కాలం నాటి విధంగా జరిపించారు నాగబాబు. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లి వేడుకలో ప్రత్యక్షం కాగా, ఆ వేడు కనుల పండుగగా సాగింది.పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్గా నటించకున్నా.. తన బ్యానర్లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.ఇటీవలే ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. Z5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన దీనికి కూడా భారీ స్పందన దక్కింది. దీంతో ఇది తక్కువ టైంలోనే మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుని హిట్ అయింది.