PawanKalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రీసెంట్‌గా విశాఖపట్నంకి వెళ్లగా అక్కడ పవన్‌కి భారీ ఆదరణ లభించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగుతోంది. జనవాణి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ నోవొటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు. దీనితో నోవొటెల్ హోటల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ ఉత్కంఠ పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ, సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. పోలీసులు పవన్ కళ్యాణ్ ఎలాంటి మీటింగులు నిర్వహించడానికి వీలు లేదని నోటీసులు అంటించారు.
ఈ క్రమంలో పవన్.. “నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆర్‌కె బీచ్‌లో సాయంత్రం అలా నడుస్తూ, స్వచ్ఛమైన గాలి పీల్చడానికి నాకు అనుమతి ఉందా?” అంటూ ట్వీట్ చేయగా, దీనికి మెగాబ్రదర్ నాగబాబు.. లెట్స్ గో బ్రదర్, నేను వస్తా నీతో అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇక పవన్ సినిమా ‘కొమరం పులి’లో నటించిన హీరోయిన్ నికేష పటేల్ కూడా జనసేన ట్వీట్ కి స్పందించింది. “నీ వెంట నేను నడుస్తా” అంటూ తన సినిమా హీరోకి రిప్లై ఇచ్చింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని రీ ట్వీట్స్ చేస్తూ ట్రేండింగ్ లో పెడుతున్నారు.

PawanKalyan : నీతో వస్తా
ఇక పవన్ కళ్యాణ్ రాకతో వైజాగ్ మొత్తం చీకటి మయం అయిన విషయం తెలిసిందే.కరెంటు లేకపోయినా కూడా సెల్ ఫోన్ల లైట్లతోనే పవన్ కళ్యాణ్ తన జన సైనికులతో ర్యాలీ నిర్వహించారు. మొత్తానికి గర్జన వర్సెస్ జనవాణి అన్నట్టుగా మారింది. పోలీసుల లాఠీ చార్జ్‌ల మధ్యనే ర్యాలీ నడిచింది. ఏదేమైన పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ చాలా ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.