Kajal Aggarwal : సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ వెండి తెర మీద ఎంతో అందంగా కనిపించే హీరో, హీరోయిన్ల తెర వెనుక ఎంతో విషాదం ఉంటుంది. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకుల గురించి చర్చ నడుస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవడంతో టాలీవుడ్ లో విడాకులపై పెద్ద చర్చ జరిగింది. చిన్న చిన్న కారణాలకే సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన వాళ్లనే ప్రేమించడం, కొన్ని రోజుల పాటు రిలేషన్ లో ఉండటం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం ఇదే ఇప్పుడు ట్రెండ్.
సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడాకులు తీసుకోవడంతో టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ప్రస్తుతం ఆ జాబితాలోకి వచ్చింది కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా ఒక హీరోయిన్ అని తెలుసు కదా. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఈ సుందరి. అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది నిషా. కానీ.. తాజాగా నిషా ఓ నిర్ణయం తీసుకుందట. తను త్వరలో విడాకులు తీసుకోబోతుందట. నిషా అగర్వాల్ 2013 లోనే పెళ్లి చేసుకుంది. తను పెళ్లి చేసుకొని 10 ఏళ్లు అవుతోంది. తను సెటిల్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలో తన అభిమానులకు నిషా షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

Kajal Aggarwal : 2013 లో పెళ్లి చేసుకున్న నిషా
బిజినెస్ మ్యాన్ మాన్ కిరణ్ ను నిషా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితంలో ఏవో మనస్పర్థలు వచ్చాయట. దీంతో భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందట నిషా. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే నిషా అగర్వాల్ తన విడాకుల గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఒక రూమరేనా.. లేక నిజంగానే నిషా విడాకులు తీసుకోబోతుందా అనేది మాత్రం తెలియదు. వాళ్ల నుంచి ఈ వార్తపై ఎటువంటి స్పందన అయితే లేదు. చూద్దాం మరి వాళ్ల నుంచి క్లారిటీ వస్తుందో లేదో?