Adipurush : ఇటీవల విడుదలైన ఆది పురుష్ టీజర్ తో ప్రభాస్, మరియు ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు వరుస అపజయాలను చూసిన ప్రభాస్ కు ఆదిపురిష్ మూవీ కూడా పరాజయాన్నిస్తే తన కెరియర్ కి ఇది పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఆది పురుష్ ను కుదిపేస్తున్న వివాదాలు ఒక విధంగా ఆ సినిమాను ఎలాంటి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో రావణాసురుడి గెటప్ మీద బాగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా బిజెపి నాయకుడు ఒకరు ,ఈ గెటప్ పై కోర్టులో కేసు వేసే ఆలోచనలు ఉన్నాయన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు రాముడి వేసాధరణ మరియు గెటప్ చాలా భిన్నంగా ఉందని అలాగే రాముడు మీసాల నుండి బాణాల వరకు ప్రతి ఒక్క అంశంపై కామెంట్స్ వస్తున్నాయి. ఇక మూవీలో ముఖ్యంగా హనుమంతుడి పాత్ర , వేషధారణ , గెటప్ , అసంబద్ధంగా చూపిస్తున్నారు అని అయోధ్య లోని ఓ రామాలయం పూజారి ఈ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు.

ఇది ఇలా ఉండగా అజయ్ దేవగన్ కు చెందిన విఎఫ్ఎక్స్ కంపెనీ ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ను తాము రూపొందించలేదని ఓపెన్ గా చెప్పడంతో మరింత సంచలనంగా మారింది.అయితే ఇటీవల లేటెస్ట్ గా విడుదలైన త్రీడీ వర్సెన్ టీజర్ కు మంచి స్పందన రావడం తో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు సినీ బృందం. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల గడువు ఉన్నప్పటికీ ,ఈ సినిమా చుట్టు అలుముకున్న వివాదాల వలన ఈ సినిమా వార్త ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంతో ఆదిపురుష్ విడుదల కాకుండానే నేషనల్ వైడ్ గా ట్రేండింగ్ గా మారింది.