Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన అందాల ముద్దుగుమ్మ నికీషా పటేల్. ‘కొమరం పులి’ సినిమాతో స్టార్ డమ్‌ని అందుకున్న హీరోయిన్ నికిషా పటేల్ కన్నడం, తమిళ్, మలయాళంలో ఈ ముద్దుగుమ్మ దాదాపు 30కిపైగా సినిమాలు చేసింది. కానీ.. టాలీవుడ్లో మాత్రం కొమరం పులి తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. ఏమైందో కానీ సడన్ గా సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్కోసారి తన అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. నికీషా అందాలు కుర్రాళ్లకు మతులు పోగొడుతుంటాయి.
సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే నికీషా దీపావళి సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక విదేశీయుడుతో ప్రేమలో ఉన్నానని… త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నానని తెలిపింది. అంతేకాదు… తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలకి దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం నికిషా పటేల్ చాలా యాక్టివ్. అప్పుడప్పుడు లైవ్‌లోకి కూడా వస్తుంటుంది.

Pawan Kalyan : మొత్తానికి పెళ్లి పీటలెక్కుతుంది..
తమిళ, కన్నడలో భాషల్లో సినిమాలు అయితే చేసింది కాని.. ఆమె వరుస సినిమాలు చేసింది కాని ఎందుకో సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పింది బ్యూటీ ఆతరువాత కనిపించకుండా పోయింది. సినిమాలు మానేసినా.. సోషల్ మీడియా ద్వార ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది బ్యూటీ. నికీషా షేర్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.