Pawan kalyan : నందమూరి బాలకృష్ణ జోరు ఇప్పుడు మాములుగా లేదు.. అఖండ సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ డిజిటల్ ప్లాట్ ఫాంలో అన్‌స్టాపబుల్ అనే షోతో పలకరించాడు. ఈ షో ఊహించని విధంగా టీఆర్పీ రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. మొదట అసలు ఈ షో సక్సెస్ అవుతుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ బాలయ్య బాబు తనదైన టైమింగ్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ టాక్ షో సెకండ్ సీజన్లో గతంలో ఎప్పుడో లేనివిధంగా సరికొత్త సెలబ్రిటీలో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడిని రంగంలోకి దించారు. పొలిటికల్ పరంగా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పటికీ ఈ తరహా రిస్క్ అయితే చేశారు.
అయితే పవన్ కళ్యాణ్‌ని తీసుకు రావాలని చాలా మంది కోరుతున్నారు. నిర్వాహకులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్‌కి మాత్రం రావడం కుదరడం లేదు. పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ లాంటి సినిమాలు రన్ లో ఉన్నాయి. అటు ఏపీలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ బిజీగా మారారు. దీంతో ప్రస్తుతం ఈ షో కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్-ఎన్ బికే కలిస్తే షో రేటింగ్ పీక్స్ లో ఉంటుందని చెబుతున్నారు.

Pawan Kalyan : తీసుకు వస్తారా..
రీసెంట్‌గా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో పవన్ ప్రస్తావన వచ్చింది. బాలయ్య ఫోన్ చేసి త్రివిక్రమ్ తో మాట్లాడుతూ అన్‌స్టాపబుల్ షోకి రావాలంటూ ఆహ్వానించారు. దానికి త్రివిక్రమ్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తానండి అన్నారు. దానికి బాలయ్య రిప్లయ్ ఇస్తూ తెలుసుగా నువ్వు ఎవరితో రావాలో అని చెప్పారు. బాలయ్య ఆన్సర్‌లోనే అన్‌స్టాపబుల్‌కి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారనేది కన్‌ఫర్మ్ అని ఆ ప్రోమో చూసినవాళ్లు అంటున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ చాలా మంచి స్నేహితులు. సో.. త్రివిక్రమ్‌తో పాటు పవన్ రాబోతున్నారనేది ఇప్పుడు నెట్టింట మరింత గట్టిగా వైరల్ అవుతుంది. మరి ఏం జరగనుందో చూడాలి.