Pawan Kalyan : చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన అనే పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక చివరిగా పవన్ భీమ్లా నాయక్ చిత్రంతో పలకరించగా, ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్నసినిమాలో నటిస్తున్నారు. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన ”ఉన్నతమైన భాష మాట్లాడి నీచమైన ఆలోచన.. లేదా, ముసలి భాష మాట్లాడి ఉన్నతమైన ఆలోచన.. రెండు కాంట్రాస్ట్ గా ఉంటాయి” డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆయన లుక్ కూడా అద్భుతంగా ఉంది. అయితే వర్క్ షాప్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన దుస్తులు, షూస్, చేతికి వాచి హాట్ టాపిక్‌గా మారాయి. ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ బూట్ల రేట్లను పది లక్షలు అని చెప్పుకొచ్చాడు. అయితే దాని రేటు అంత ఉండదని, ఇంకొందరు అంటున్నారు.

Pawan Kalyan : ఇంత రేటా?
దాని రేటు ఒకరేమో లక్ష అని అంటే.. ఇంకొకరు పది వేలు మాత్రమే అని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బూట్లు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పది లక్షలు ఉంటాయని చెబుతుండగా, ఇది వినన్ కొందరు నెటిజన్స్ చిన్న పాటి ఇల్లు కట్టొచ్చనే కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన పవన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని, వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ధీమాను నిర్మాత ఏ ఎం రత్నం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.