Ponniyin Selvan: I : తమిళ బాహుబలిగా మీడియాలో తెగ నానిన పొన్నియన్ సెల్వన్ చిత్రం రీసెంట్గా విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ‘పొన్నియన్ సెల్వన్-1’. సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ.. అందాల తారలు ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు పీఎస్-1 చిత్రం రూ. 41.80 కోట్ల వరకు సాధించింది.
మొదటి రోజు తమిళంలో రూ. 25.86 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. దాంతో ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. అజిత్ ‘వలిమై’ సినిమా రూ. 36.17 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టగా.. విజయ్ ‘బీస్ట్’ చిత్రం రూ. 26.40 కోట్లు వసూల్ చేసింది. పొన్నియల్ సెల్వన్ మూవీపై క్రికెటర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పోస్ట్ చేశాడు. సినిమాను ఆకాశానికెత్తేసిన అశ్విన్… మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కీర్తించాడు. పనిలో పనిగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు ఉన్నారని తెలిపిన అశ్విన్… మీ అభిమాన నటుడు ఎవరు అంటూ ఓ ప్రశ్న సంధించాడు.

Ponniyin Selvan: I : టాలీవుడ్లో తేలిపోయింది..
తమిళులు ఏదో రకంగా ఈ సినిమాని అయితే లేపుతున్నారు. మనదగ్గర ఇంకా ఇతర భాషల్లో కొన్ని సిటీల్లో మినహాయించి మిగిలిన సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు.ఒకవేళ మూవీకి వచ్చిన టాక్ బ్రహ్మాండంగా వచ్చి ఉంటే పికప్ అయ్యేదేమో కాని ఈ రెండు రోజులు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఈ సినిమా ఇంట బాగానే లాభాలు రాబడుతున్నా కూడా బయట మాత్రం ముఖ్యంగా తెలుగులో అంత ఆకట్టుకోలేకపోతుంది. పిఎస్ 1కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చి ఉంటే అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలకు ఇబ్బంది కలిగేది. థియేటర్ల కౌంట్ దగ్గర పంచాయితీ పడేది. కానీ ఇప్పుడా సమస్య లేదు.మనోళ్లు దున్నుకోవచ్చు.