Poorna : టాలీవుడ్ లోకి ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పూర్ణ. ఈ అమ్మడు కథనాయికగా అలరించి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్లో మెరిసి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. కాని సోషల్ మీడియాలో కొద్దిగా డోస్ పెంచినట్టు కనిపిస్తుంది. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందని.. పూర్ణ పై ఇష్టంతోనే ఆమెకు అన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ రవిబాబుపై వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పూర్ణ తన నిశ్చితార్థం జరిగిందని ప్రకటించింది. ఆ తర్వత పలు కారణాల వలన వీరిద్దరు విడిపోయారిన ప్రచారాలు నడిచాయి. కాని జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగిందని తెలిపింది పూర్ణ. దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని , దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక తన భర్త పేరు షానిద్ ఆసీఫ్ ఆలీ అని, చాల సంవత్సరాల నుంచి పరిచయం ఉందని చెప్పుకొచ్చింది.

Poorna : దేశ సమస్య..
ఆ పరిచయం తామిద్దరం మధ్య ప్రేమగా మారిందని చెప్పుకొచ్చిన పూర్ణ.. కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల మేమిద్దరం నిర్ణయం తీసుకోలేకపోయాం. కొద్దికాలంగా మా మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. నా హృదయానికి దగ్గరైన వ్యక్తి ఆయన. మా పెళ్లికి ఇరు కుటుంబాలు సమ్మతం తెలియజేయడంతో మేమిద్దరం ఒక్కటయ్యాం. మా సుదీర్ఘమైన ప్రేమాయాణానికి అలా ముగింపు పడింది అని నటి పూర్ణ తెలిపారు. దుబాయ్‌లో జరిగిన మర్హాబా కార్యక్రమంలో మా ఫ్యామిలీ అభిప్రాయాలు, ఆయన ఫ్యామిలీ అభిప్రాయాలు కలిశాయి. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సవ్యంగా జరిగిపోయాయి. భగవంతుడి దయ, ఆశీర్వాదం వల్ల అన్ని పాజిటివ్‌గా జరిగిపోయాయి అని పూర్ణ తెలిపింది.