Prabhas Fans : మిగితా హీరోల ఫ్యాన్స్ ఒక ఎత్తు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఎత్తు.. ఈ ఒక్క దెబ్బతో ప్రూవ్ అయ్యిందిగా

Advertisement

Prabhas Fans : ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే.. హీరోల పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం. హీరోల పుట్టిన రోజు, లేదా ఏదైనా స్పెషల్ డే సందర్భంగా తమ అభిమాన హీరోల క్రేజీ సినిమాలను ఆయా హీరోల ఫ్యాన్స్ రీరిలీజ్ చేస్తున్నారు. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు కెరీర్ లోనే పోకిరి సినిమా ఒక బ్లాక్ బస్టర్. అలాగే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున జల్సా, తమ్ముడు సినిమాను రీరిలీజ్ చేశారు ఆయన అభిమానులు.

Advertisement

ఇలా చాలామంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వాళ్ల కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలను రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే రానుంది. ఈ సందర్బంగా ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్స్ అయిన బిల్లా, రెబల్ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆయన ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Advertisement
prabhas fans are enjoying disasters of prabhas
prabhas fans are enjoying disasters of prabhas

Prabhas Fans : బోసిపోతున్న రెబల్ సినిమా థియేటర్లు

నిజానికి రెబల్ సినిమానే ఫ్లాప్ సినిమా. అయినా కూడా ఆ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ రిలీజ్ చేశారు. ప్రభాస్ బర్త్ డేకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నా ఇప్పుడే రెబల్ ను పలు థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ.. ఎక్కడ చూసినా ఆ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇక.. ఆయన పుట్టిన రోజు నాడు బిల్లా, వర్షం సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. వర్షం సినిమా ఓకే కానీ.. బిల్లా సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో సినీ అభిమానులకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్సే వెరైటీ, డిఫరెంట్ అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రభాస్ డిజాస్టర్ సినిమాను కూడా వాళ్లు పండుగ చేసుకుంటున్నారు. మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి.

Advertisement