Prabhas : హీరోలందరు బాగానే ఉన్నా కూడా అభిమానుల మధ్య ఈ గొడవలు ఎందుకుజరుగుతున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు. ప్రతి దానికి ఏదో కంపేర్ చేసి గొడవలు పడుతున్నారు. ఇటీవల మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య ఫైటింగ్ సృష్టించిన నెటిజన్స్ ఇప్పుడు ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ అన్నట్టు ట్రెండ్ మార్చారు. ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్, ప్రభాస్ అభిమానుల మధ్య వార్ కి దారి తీసింది. ఇదివరకే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇప్పుడు ప్రభాస్ కూడా రాముడిగా కనిపిస్తున్నాడు. దీంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి పాత్ర కోసం రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన పోస్టర్ ను పక్క పక్కన పెట్టి కంపైర్ చేస్తూ ఉన్నారు. చరణ్ అభిమానులు నిజంగా రాముడిని చూసినట్లుగా ఉందని అంటుంటే ప్రభాస్ అభిమానులు రాముడు అంటే నిజంగా ఇలాగే ఉండేవాడేమో అన్నట్లుగా కామెంట్ల వర్షః కురిపిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
దీంతో ఇద్దరు హీరోల మధ్య చర్చ నడుస్తుంది. రామ్ చరణ్ అభిమానులు అల్లూరి సీతారామరాజు గెటప్ లు రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ప్రభాస్ రాముడి లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. ఈ గొడవ ఎంత దూరం వెళతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, రామ్ చరణ్ .. రాముడు పాత్రకు సరిగ్గా సరిపోయాడని హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపించారు. మరి ఇప్పుడు ప్రభాస్ పాత్రకు ఏ రేంజ్ లో స్పందన వస్తుందో చూడాలి.