Prabhas : బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తన సినిమాలు పైన భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాదే శ్యామ్ మూవీస్ నిరాశను మిగిల్చాయి. ఇక ఇటీవల ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ పై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. రామాయణ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా ,కృతి సనన్ సీతాదేవిగా కనిపించనున్నారు.
అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. టీజర్ ఇలా విడుదల అయిందో లేదో చాలామంది హిందువులు తమ మనోభావాలను గాయపరిచారు అంటూ, డైరెక్టర్ ఓం రౌత్ ను తిట్టారు. అలాగే ఈ సినిమాపై స్టే విధించాలని పిటీషన్స్ కూడా దాఖలాలు చేశారట. ఇక ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆది పురుష్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ని సైడ్ చేయడానికి ప్రభాస్ నెక్స్ట్ సినిమాల గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఆది పురుష్ తర్వాత ప్రభాస్ తీసే సినిమా సలార్.

దీనికి కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ దాదాపు 70% కంప్లీట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ సినిమా అంటే పక్కా మాస్ మసాలాతో ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఆది పురుష్ టీజర్ విడుదలైన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపైన ఆశలు వదులుకొని సలార్ పైన భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకాలకు తగ్గట్లుగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ చేయగలడో లేదో వేచి చూడాలి.