Prabhas : కోపంతో ఊగిపోయిన ప్ర‌భాస్.. డైరెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చి ప‌డేసాడా..!

Advertisement

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎంత కూల్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా చాలా కూల్‌గా ఉంటాడు. వివాదాల జోలికి పోడు, ఒక్క‌రిని కూడా ప‌ల్లెత్తు మాట అన‌డు.అయితే తాజాగా ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌పై గ‌రం అయిన‌ట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వివ‌రాల‌లోకి వెలితే హీరో ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా నుంచి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆశగా అభిమానులు ఎదురు చూశారు. ఆదిపురుష్ నుంచి దసరా కానుకగా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ టీజర్ ( adipurush teaser )  విడుదల చేశారు మేకర్స్. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వీటిన్నింటిపై సోషల్ మీడియా వేదికగా భయంకరంగా ట్రోలింగ్ జరుగుతోంది.

Advertisement

కోపం వ‌చ్చింది..ఇది రామాయణంలా లేదని.. ఏదో యానిమేషన్ సినిమా చూస్తున్నట్లు ఉందని విమర్శిస్తున్నారు. మరికొందరు యానిమేషన్ సినిమా తీస్తే ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది టీజర్‌ను కేవలం గ్రాఫిక్స్‌తో నింపేశారని మండిపడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. డీస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం అయ్యే హనుమాన్ సిరీస్ ఆదిపురుష్ కంటే చాలా బెటర్ అంటూ వ్యగ్యంగా పోస్టులు పెడుతున్నారు. యన్ సెల్వన్ నెగిటివ్ టాక్ తో గుర్రుగా ఉన్న త‌మిళ తంబీలు, బాలీవుడ్ జ‌నాలు ఇంకాస్త గ‌ట్టిగానే సినిమాను ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
prabhas fire on director
prabhas fire on director

ఈ క్ర‌మంలో ప్ర‌భాస్.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌ ( Om Raut ) పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.టీజర్ లాంచ్ తర్వాత ప్రభాస్ బస చేసిన హోటల్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా.. ఓం నువ్వు నా రూమ్ కి వస్తున్నావుగా.. రా అంటూ ఆగ్రహంతో పిలుస్తున్నట్లు ఉంది. రూమ్ లో ఓం రౌత్ కి ప్రభాస్ క్లాస్ పీకడం ఖాయం అంటున్నారు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేందుకే ప్రభాస్ ఓం రౌత్ ని పిలుస్తున్నాడు అని అంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. బాహుబలి సమయం నుంచి ప్రభాస్ ఏదో ఒక గాయంతో బాధపడటం, సర్జరీలు అంటూ రెస్ట్ తీసుకోవడం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ప్రభాస్ తన సర్జరీలో బాధపడుతూనే ఉన్నాడు.

Advertisement