Prabhas : డిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీ యూనిట్ కు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ మూవీ యూనిట్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో హీరోగా నటించిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు కూడా నోటీసులను కోర్టు జారీ చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో చేస్తుండగా ఈసినిమాను రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈనేపథ్యంలో ఈ సినిమా యూనిట్ కు కోర్టు షాకిచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
అయితే.. ఆ టీజర్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీన్లు ఉన్నాయని ఓ సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆదిపురుష్ మూవీ యూనిట్ మొత్తం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆ సంస్థ కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు.. సినిమాను విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ఆ సంస్థ కోర్టును కోరింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. వెంటనే సినిమా హీరో ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ మూవీ యూనిట్ కు నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజులుగా ఆదిపురుష్ సినిమా టీజర్ పై ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.

Prabhas : సినిమాను విడుదల చేయకుండా స్టే ఇవ్వండి
సినిమా టీజర్ కార్టూన్ నెట్ వర్క్ లా ఉందంటూ సినిమా టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి. యానిమేషన్ సినిమాలో ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. అసలు రాముడి పాత్రను కించపరిచేలా తీశారని, అలాగే రావణుడు, హనుమంతుడి పాత్రలను కూడా సరిగ్గా చూపించలేదని పలువురు హిందుత్వ వాదులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని ఏకంగా ఓ సంస్థ కోర్టుకెక్కింది. దీనిపై కోర్టు కూడా వెంటనే స్పందించి మూవీ యూనిట్ కు నోటీసులు జారీ చేసింది. మరి.. కోర్టు నోటీసులపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.