Prabhas : బాలీవుడ్ లో ప్రభాస్ హవా.. ఆదిపురుష్ లో ప్రభాస్ ను తీసుకోవడానికి గల కారణం ఇదే…!

Advertisement

Prabhas : రెబల్ స్టార్ కృష్ణం రాజు ,అనారోగ్యంతో ఈ మధ్యనే కన్నుమూశారు.ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని ఇంటికి తీసుకు వచ్చినప్పుడు సినీ ప్రముఖులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.మరుసటి రోజు కృష్ణంరాజు అంతక్రియలు జరిగేంతవరకు చాలా మంది అక్కడే ఉన్నారు. అయితే అందులో కృష్ణంరాజు అభిమానులు ఉన్నప్పటికీ …ఎక్కువ శాతం ప్రభాస్ అభిమానులు ఉన్నారు.ఈ ఒక్క సంఘటన చాలు తన అభిమానులకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. ప్రభాస్ కి కూడా తన అభిమానులు అంటే అంతే ఇష్టం. అందుకే దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం బాధలో ఉండి కూడా భోజనం ఏర్పాటు చేయించాడు.

Advertisement

ప్రతి ఒక్కరికి కచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్ అని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  బాహుబలి తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ట్ గా మారిన ప్రభాస్ ఏమాత్రం హిపోక్రసీ చూపించడు.పాన్ ఇండియా స్టార్ట్ అయినప్పటికీ గర్వం లేకుండా వేరే సినిమాల కోసం ప్రమోషన్లలో పాల్గొన్నాడు.ఈ మధ్య వచ్చిన జాతి రత్నాలు మరియు పూరి ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలకు తన వంతు ప్రమోషన్ చేశాడు.అలాగే ఇటీవల రిలీజ్ అయిన సీతారామమ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ సినిమా విజయంలో భాగస్వామి అయ్యాడు.ఇంకా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తన వంతు సాయం చేస్తాడు మన ప్రభాస్ .ఎంత చేసినా ఏమాత్రం ప్రచారం చేసుకొని ప్రభాస్ లో ప్రొఫైల్ ను ఇష్టపడతాడు. అందుకే కాబోలు ప్రభాస్ ని అభిమానులు డార్లింగ్ పిలుస్తారు.

Advertisement
Prabhas in Adipurush casting for the reason
Prabhas in Adipurush casting for the reason

ఇప్పుడు ప్రభాస్ వరుసగా ఆదిపురుష్,స్పిరిట్ ,సలార్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా మొత్తం 5 సినిమాలు చేయనున్నాడు. అయితే వీటిలో ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో, బాలీవుడ్ స్టార్ ,సైప్ అలీ ఖాన్ రావణుడిగా , కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ,బాలీవుడ్ స్టార్ హీరోలను పక్కనపెట్టి ఆదిపురుష్ కు ప్రభాస్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అని,డైరెక్టర్ ఓం ప్రకాష్ రౌత్ ని అడగగా తను ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ నటనపై చూపించే ఆసక్తి ,సినిమా మీద తనకు ఉన్న మక్కువ ,సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం అని చెప్పుకొచ్చాడట డైరెక్టర్ ఓం ప్రకాష్ రౌత్.

Advertisement