Prabhu Deva : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నయనతారకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి తగ్గిపోయిందని అంటున్నారు. దీంతో నయాన్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. దాదాపు 17 ఏళ్లుగా దక్షిణా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఉన్న నయనతార.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ మూవీతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది.
తమిళంలో గోల్డ్ అనే సినిమా ఈ సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. మరో రెండు సినిమాలకు సైన్ చేసింది. నయనతార కెరీర్ సజావుగానే సాగిన ఈ అమ్మడు పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్రబెన్స్ వచ్చాయి. అప్పట్లో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తర్వాత ప్రభుదేవా ప్రేమలో పడింది. అతనితోను బ్రేకప్ అయింది.ఎందుకు చెడిందో గానీ, ఇద్దరూ మళ్ళీ వేరయ్యారు. ప్రభుదేవా, నయన్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే, నయన్‌ని ప్రభుదేవానే మోసం చేశారని లోలోపల ఓ టాక్ ఉంది. దాదాపు 20 కోట్ల వరకు నయన్ నుంచి ప్రభుదేవా తీసుకున్నారట. ఇక ప్రేమ, పెళ్లి పేరుతోనూ సన్నిహితంగా మెలిగారనేది కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించిన మాట, స్వలాభాల కోసం ప్రభుదేవా..

Prabhu Deva : అలా చేశాడా..
నయనతారని దారుణంగా వాడుకున్నాడనే టాక్ ఉంది.సౌత్‌లో తెలుగు తమిళం, హిందీలో ఒకవైపు డాన్స్ మాస్టర్‌గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు ప్రభుదేవా. ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనీంచే అవకాశం వస్తే అసలు వదలరు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే గొప్ప పేరు తెచ్చుకున్నారు ప్రభుదేవా. మెగాస్టార్ లాంటి వారు పిలిచి మరీ అవకాశం ఇచ్చేంత క్రేజీ డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవా..దర్శకుడిగానూ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లకి ఈయన చాలా ప్రత్యేకం. సౌత్‌లో బ్లాస్ట్ అయిన పోకిరి లాంటి సినిమాలను హిందీలో తీసి హిట్స్ అందుకున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ లో ఓ సాంగ్‌కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే.