Priyamani : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కార్యక్రమం నుండి ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్న నేపథ్యంలో షో యొక్క రేటింగ్ దారుణంగా పడి పోతుంది. ఒకప్పుడు సుదీర్ మరియు రష్మీ ఉన్న సమయంలో టాప్ రేటింగ్ దక్కింది. వారిద్దరూ ఉన్నప్పుడు వచ్చిన రేటింగ్ లో ప్రస్తుతం సగం రేటింగ్ కూడా రావడం లేదంటూ నిర్వాహకులు చెబుతున్నారు. అయినా కూడా శ్రద్ధ తీసుకోకుండా మల్లెమాల వారు పదే పదే తప్పులు మీద తప్పులు చేస్తూ ఉన్నారు. క్రేజ్ ఉన్న వారిని తొలగిస్తూ అనవసర తప్పిదాలను చేస్తూ పెద్ద ఎత్తున విమర్శల ఎదుర్కొంటుంది. తాజాగా మరో సారి ఈ డాన్స్ కార్యక్రమం రేటింగ్ మరింతగా తగ్గింది.
సుడిగాలి సుదీర్ మరియు రష్మీ గౌతమ్ వెళ్లి పోయిన తర్వాత ఎక్కువ మంది ప్రియమణి కోసం కార్యక్రమాన్ని చూసే వాళ్ళు, ఇప్పుడు ఆమె కూడా కార్యక్రమం వదిలి వెళ్ళి పోయింది అంటూ కన్ఫర్మ్ అయింది. ఆ మధ్య పారితోషికం విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల ప్రియమణి మల్లెమాల నుండి దూరమైపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ కి మల్లెమాల వారు ఆమెను తీసుకొచ్చారు. ఆమె కూడా సందడి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు. దాంతో ప్రియమణి ఈ సారి పూర్తిగా ఈ డాన్స్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసినట్లే అంటూ ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్, యానీ మాస్టర్ ఢీ డాన్స్ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

అప్పుడప్పుడు పూర్ణ కూడా వస్తోంది. వీరి ముగ్గురితో పాటు జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ గెస్ట్ లుగా వస్తున్నారు. జడ్జిలు గెస్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం కార్యక్రమం రెగ్యులర్ గా జడ్జిలు ఉండరా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు. ఈ సీజన్ తర్వాత ప్రదీప్ కూడా యాంకరింగ్ వదిలేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఈ డాన్స్ కార్యక్రమం పరిస్థితి ఏంటో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఈ డాన్స్ కార్యక్రమంలో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో మంది గొప్ప డాన్సర్స్ ని అందించిన ఢీ డాన్స్ షో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పాలి. ఈ ఇబ్బందుల నుండి బయట పడుతుందా లేదా అనేది చూడాలి.