Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.తెలుగులో ఎన్టీఆర్ బాలకృష్ణ సహా పలువురు బడా హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అనిపించుకున్న ప్రియమణి తర్వాతి కాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో కేరళకు చెందిన ముస్తఫా రాజ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. నిజానికి ముస్తఫా రాజ్ కు అంతకుముందే పెళ్లైనప్పటికీ అతన్ని వివాహం చేసుకుంది. ఈ విషయంలో అతని మొదటి భార్య నుంచి ప్రియమణికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.అవన్నీ సాల్వ్ చేసుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉంది.
అయితే ప్రియమణి కి తన భర్తతో విభేదాలు వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.. గొడవల కారణంగా ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి . ఆమె భర్తకు ప్రియమణికి సరిగా పోసగడం లేదని ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం కూడా మొదలైంది. ఈ రూమర్స్ పై ప్రియమణి కూడా అంతగా స్పందించలేదు. రీసెంట్ గా ప్రియమణి తన భర్తకి సంబంధించిన పోస్ట్ లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడంతో ఫ్యాన్స్ లో ఈ చర్చ ఎక్కువైంది. అయితే ఈ రూమర్స్ కి తెరదించుతూ ప్రియమణి తన భర్త గురించి పోస్ట్ చేసింది. దీపావళి సందర్భంగా ప్రియమణి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Priyamani : క్లారిటీ ఇచ్చారు..
తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటూ ఆ పిక్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రియమణి. నా నుంచి నా వాళ్ళ నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. తన భర్తని ఉద్దేశిస్తూ ‘మిస్ యు ముస్తఫా రాజ్’ అని కూడా కామెంట్ పెట్టింది. దీనితో కొన్నాళ్లుగా వీరిద్దరి గురించి వస్తున్న రూమర్స్ దీపావళి రోజున పటాపంచలు అయినట్లు ఐంది. ముస్తఫా తన బిజినెస్ వర్క్ వల్ల యుఎస్ లో బిజీగా ఉన్నాడని.. అందువల్లే వీరిద్దరూ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. భామాకలాపం, నారప్ప వంటి సినిమాల్లో ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్నాళ్ల క్రితం వరకు మల్లెమాల నిర్వహిస్తున్న ఢీ షోలో జడ్జిగా కూడా ఆమె పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేసింది.