Priyamani : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లోను దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాలు, మరో వైపు టీవీ షోస్, ఇంకో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ స్లిమ్ గా తయారై అందాలను యదేచ్చగా ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఆమె సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ షేర్ చేసింది అంటే ఆ రోజు అభిమానులకి జాతరే అని చెప్పాలి. ప్రియమణి కుర్ర హీరోయిన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. ప్రియమణి చివరిగా ‘భామా కలాపం’తో ప్రేక్షకులను అలరించింది. అలాగే ‘విరాట పర్వం’లోనూ భారతీ అనే కమ్యూనిస్టు పాత్రలో నటించి మెప్పించింది.ఒకవైపు గ్లామర్ పాత్రలు మరో వైపు రొమాంటిక్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది.
బెంగళూరుకు చెందిన హీరోయిన్ ప్రియమణి తన కేరీర్ ను మోడలింగ్ తో నే ప్రారంభించింది. ముందు భరణి సిల్క్స్ మరియు లక్ష్మి సిల్క్స్ కు యాడ్ షూట్ చేసింది. 19 ఏండ్లకే హీరోయిన్ గా వెండితెరపై మెరిసిన ఈ అమ్మడు ‘ఎవరే అతగాడు’తో హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయి మెప్పించింది.తెలుగులో ప్రియమణి నటించి బెస్ట్ చిత్రాల్లో ‘పెళ్లైన కొత్తలో, టాస్, యమదొంగ, నవ వసంతం, హరే రామా, కింగ్, ద్రోణ, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రక్త చరిత్ర’ మంచి హిట్ సాధించాయి. వీటిలోనూ ప్రియమణి పేరు చెప్పగానే ఇప్పటికే గుర్తుకు వచ్చే చిత్రం ‘యమదొంగ’ అనే చెప్పాలి. అంతలా ఆ చిత్రంలో మెప్పించింది.

Priyamani : నిర్మాతతో ఇబ్బందులు..
అయితే ప్రియమణికి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. ఆ సినిమా కోసం ప్రియమణి బొడ్డుపై టాటూ వేసుకోవాలని ఆదేశించారంట. దీనికి తను నిరాకరించిందంట. అప్పటికే రెమ్యూనరేషన్ తీసుకోవడం.. చిత్ర షూటింగ్ కాస్తా ముందుకు వెళ్లడంతో ప్రియమణి చేసేదేమీ లేక ఒప్పుకుందట. అసలు విషయం ముందే తెలిస్తే సినిమాను రిజెక్ట్ చేసే ఉండేదానిని అని ప్రియమణి చెప్పుకొచ్చిందట. ప్రియమణికి కూడా సినిమా కష్టాలు తప్పలేదనే చెప్పాలి. ఈ అమ్మడు కొన్నాళ్లు సినిమాల్లో జోరు తగ్గించినా.. టీవీ షోస్ ల ద్వారా ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తుంది. ‘ఢీ’షో ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది.