Puri Jagannadh : లైగ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. లీక్ అయిన ఆడియా

Advertisement

Puri Jagannadh : ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో లైగ‌ర్ అనే సినిమా చేయ‌గా, ఇది ఎంత‌గా దెబ్బ‌కొట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో కోట్లు సంపాదించి స‌రికొత్త రికార్డ్ సృష్టిస్తామ‌ని అనుకున్న వారి అంచ‌నాలు అన్ని త‌ల‌కిందులు అయ్యాయి. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్‌ నష్టాలను మిగిల్చింది. సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లు ..మాత్రం చాలా కోపంగా ఉన్నారని, రెండో నెలలు దాటినా తమకు క్లియరెన్స్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.

Advertisement

దీపావళి రోజు పూరి జగన్ వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ అవటం మొదలెట్టింది. అది కావాలని లీక్ చేసారా అని కొందరు సందేహపడుతున్నారు. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది అంటే.’ఇస్తాను అని చెప్పను కదా..ఇలా ఊరికే చిరాకు రప్పిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని అనిపించట్లేదు’ అంటూ డిస్ట్రిబ్యూటర్స్ కి ఫోన్ కాల్ లో చెప్పాడట పూరి జగన్నాథ్..ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగిఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడ్డం జరిగింది. మన ఒప్పందం ప్రకారం చెప్పిన మొత్తాన్ని ఒక నెలలో ఇస్తాను. అలా చెప్పాక కూడా మళ్లీ ఇలా చేస్తుంటే ఇవ్వాలని అనిపించదు. అయినా మేం ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను.

Advertisement
puri jagannath audio leaked
puri jagannath audio leaked

Puri Jagannadh :  ఆడియో లీక్..

ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని సినిమాలు పోతాయి. పోకిరి దగ్గరనుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూల్ చేసి పెడుతుందా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని, వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి ఇస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ ఆడియో కాల్, మెసెజ్ వైరల్ అవుతోంది. గతం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమాకి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి..కానీ చిరంజీవి మరియు కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి అందాల్సిన నష్టపరిహారం అందించేసారు.. లైగ‌ర్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మించారు. చిత్రాన్ని రూ. 90 నుంచి 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు తెలుస్తోంది

Advertisement