Pushpa 2 Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో బన్నీ నటన, ఆయన మేనరిజం ప్రతి ఒక్కిరకి తెగ నచ్చేసాయి. ఈ క్రమంలోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో పుష్పపార్ట్ 1 మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక పార్ట్2 సినిమా కోసం దేశమంతా ఎంతో ఉత్కంటతో ఎదురుచూస్తోంది. ఈ మూవీ షూటింట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా..? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . వారి కోసం ఓ ఆసక్తికర అప్డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 షూటింగ్ ను నసొంత స్టూడియోలోనే స్టార్ట్ చేయబోతున్నాడట బన్నీ. అల్లు స్టూడియోస్ అక్టోబర్ 1న హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కానుండగా, అందులోనే పుష్ప 2 మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. . ఇదే నిజమైతే అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా లాంఛ్ కాబోతున్న అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకోనున్న మొదటి సినిమా పుష్ప 2 నే అవుతుంది. ఇది బన్నీకి చాలా స్పెషల్ అనే చెప్పాలి.ఫస్ట్ పార్ట్‌ని మించి పుష్ప 2 చిత్రీకరణ జరగనున్నట్టు సమాచారం. పుష్ప 2లో నటీనటుల విషయానికి వస్తే కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ రోల్లో కనిపించనుంది.

Pushpa 2 Movie ; ఇక సందడి షురూ…
ఇక రెండో పార్టులో ఫహద్ ఫాసిల్ పాత్ర కొనసాగింపు ఉండగా..ఈ సారి విజయ్ సేతుపతి కీ రోల్లో కనిపించబోతున్నాడని సమాచారం.ఇక ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని ,ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందని, కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని ఇలా సోషల్ మీడియాలోఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటిదేమి లేదని అన్నారు నిర్మాతలు.