Pv Sindhu : భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు తెచ్చిపెట్టిన మన తెలుగమ్మాయి పీవీ సింధూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ట్రెండ్‌కి తగ్గట్టు రచ్చ చేస్తుంటుంది. ఇటీవల తన హోమ్ టూర్ చేయగా, తెగ ట్రెండింగ్ అవుతుంది. కశ్మీరీ ఫైల్స్, కార్తికేయ 2 ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల పీవీ సింధూ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా సింధు పతకాలను తన కెమెరాలో బంధించి హోమ్ టూర్ చేశారాయన.. పీవీ సింధు విజయాలను స్వయంగా చూసిన అనుపమ్ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మండి.
సింధు ఏం చేసిన కూడా అది సంచలనమే అవుతుంది. రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలను సాధించిన ఆమె.. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఇక ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లోనూ పసిడి పతకంతో మెరిసింది. అయితే కాలి గాయంతో బాధ పడుతున్న సింధు.. ఆటకు కొన్ని రోజులు విరామం ప్రకటించింది. దాంతో ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది గుజరాత్ లో మెరిసింది. దసరా పండుగ నేపథ్యంలో దేశమంతా దేవీ నవరాత్రలు జరుగుతున్న సమయంలో నవరాత్రి వేడుకల్లో సింధు పాల్గొంది. గుజరాతీ వస్త్రాదారణలో మెరిసిన సింధు..

Pv Sindhu : డ్యాన్స్ అదరహో…
అక్కడి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. ఇక తాజాగా సింధు ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందులో సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే ఆమె అప్పుడప్పుడు ఇలా నెట్టింట పలు వీడియోలతో సందడి చేస్తూ ఉంటుంది. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని, మంచి ఫ్రెండ్ కూడా అని ఇటీవల సింధు చెప్పుకొచ్చింది.
View this post on Instagram