Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా స్థాయి పెరగగా, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో రెట్టింపు అయింది. ఇక ఇప్పుడు మహేష్ తో సినిమా చేసి తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని హాలీవుడ్ కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ రాగా, వారి కోరిక తీరేందుకు ఎంతో సమయం లేదు. మరి కొద్ది రోజులలోనే ఈ సినిమా తెరకెక్కనుండగా, ఇందుకు సంబంధించిన క్యాస్టింగ్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అయితే తాజాగా శ్యామ్యూల్ ఎల్ జాక్సన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం.
అవేంజర్స్, స్టార్ వార్స్, ట్రిపుల్ ఎక్స్, జురాసిక్ పార్క్, మార్వెల్ చిత్రాల్లో నటించే ఈ యాక్టర్ ప్రతి సినిమాకు సుమారు రూ. 80 కోట్ల నుంచి 160 కోట్ల పారితోషికం తీసుకుంటున్న కూడా తమ సినిమాకి కావాలని రాజమౌళి తన సినిమా కోసం తీసుకున్నాడట. క్రిస్ హేమ్స్ వర్త్ ని కూడా ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల రాజమౌళి చెబుతూ, మహేష్ తో సినిమాని యాక్షన్ అడ్వెంచర్‌గా, ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి యాత్ర నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని అందుకోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లని కూడా తీసుకోవాలనుకుంటున్నారట. పూర్తిగా దీన్ని ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చబోతున్నారట రాజమౌళి.

Mahesh Babu ; భారీ రేంజ్‌లో..
ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ టాలెంట్ కంపెనీ `క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ`(సీఏఏ)తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఊహించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో జక్కన్న ఉన్నారట. `ఇండియానా జోన్స్` తరహాలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం అటు మహేష్, ఆయన అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. ఆ
సినిమా తర్వాత వెంటనే రాజమౌళి సినిమా మొదలు పెట్టనున్నాడ మహేష్.