Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి అపజయం అనేది లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
మహేష్ సినిమా కోసం రాజమౌళి అద్భుతమైన స్కెచ్ వేసాడట. ముందుగా ఈ సినిమాలో ముందు లేడీ విలన్ అనుకున్నా… స్టార్ హీరోని తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, కమల్ హాసన్ పేర్లు వినపడగా… వాళ్ళు నో చెప్పారని, చివరకు కార్తీ పేరుని పరిశీలించిన జక్కన్న… కార్తీని ఫైనల్ చేసారని తెలుస్తుంది. కథ చెప్పగా కార్తీ కూడా ఓకే అన్నాడని టాక్. తమిళంలో ఈ సినిమాకు క్రేజ్ రావడానికి కమల్ హాసన్ ని కూడా గెస్ట్ రోల్ లో చూపించే ప్లాన్ చేస్తున్నారట. ఈమూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని కొంతమంది అంటుంటే మరికొంత మంది మాత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది..

Rajamouli : సూపర్ స్కెచ్
తమిళ హీరో కార్తీ విషయానికి వస్తే మనోడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయనకు ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ‘ఖైదీ’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో కార్తి మార్కెట్ పెరిగింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్‌లో ముఖ్య పాత్ర పోషించి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు కార్తీ ఇమేజ్ను, మార్కెట్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్యాష్ చేసుకోబోతున్నారని టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న చేయబోతున్న సినిమాలో కార్తి కూడా నటిస్తున్నారని తెగ ప్రచారం జరుగుతుండగా, దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియాల్సి ఉంది.