Rajamouli : ప్రభాస్ ,కృతి సనన్ ప్రధాన పాత్రలలో ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుండగా, ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ విల్లు ఆకాశానికి ఎక్కు పెట్టి తీక్షణంగా చూస్తున్నట్టుగా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ఇటీవల రాధే శ్యామ్ దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు అంతా ఆదిపురుష్ మూవీపైనే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని పెంచింది. పాన్ ఇండియా సినీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ కోసమే ఆసక్తిగా మాట్లాడుకుంటుండగా ట్విట్టర్ లో అయితే ఆదిపురుష్ మరియు ప్రభాస్ పేర్లే ఇండియన్ వైడ్ ట్రెండింగ్ గా నిలిచాయి. మొత్తానికి అయితే ఆదిపురుష్ ప్రకంపనలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ ఫస్ట్ లుక్ చూసిన రాజమౌళి కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ప్రభాస్ రాముడిగా అదిరిపోయాడని, బాహుబలిని మించి ఈ సినిమా హిట్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Rajamouli : క్రేజీ లుక్..
ఆదిపురుష్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వాల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తల వస్తున్నాయి. ఈ రకంగా ‘ఆదిపురుష్’ సినిమా పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను 3Dతో పాటు డాల్బీ లో విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కె అనే సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జానర్లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో హిందీ స్టార్ హీరో సంజయ్ దత్ నటించనున్నారట.