Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో తెలుగులో పరిచయం అయింది ఈ భామ. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తెలుగులోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత హిందీ, తమిళం ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది రకుల్. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓ వ్యక్తిని ప్రేమిస్తోందంటూ వార్తలు కూడా వచ్చాయి. తన లవర్ గురించి రకరకాల వార్తలు రావడంతో తన లవర్ ను తనే పరిచయం చేసింది రకుల్.
జాకీ భగ్నానీని తాను ప్రేమిస్తున్నట్టు చెప్పింది రకుల్. అయితే.. వీళ్లు చాలా ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ.. వీళ్ల పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం తెలియలేదు. అయితే.. రకుల్ పెళ్లిపై తాజాగా ఆమె తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. బాలీవుడ్ తో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన అటాక్, కట్ పుట్లి, రన్ వే సినిమాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ను తన పెళ్లి ఎప్పుడంటూ అందరూ ప్రశ్నిస్తుండటంతో జాకీ భగ్నానీ గురించి చెప్పుకొచ్చింది రకుల్. ఆయన ఎవరో కాదు..

Rakul Preet Singh : ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రకుల్
బాలీవుడ్ నటుడు, నిర్మాత. తన లవర్ తో దిగిన ఫోటోను ఇన్ స్టా లో పోస్ట్ చేసి తన లవ్ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టించింది రకుల్. అయితే.. త్వరలోనే రకుల్, జాకీలు వివాహం చేసుకోబోతున్నారని.. రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే రకుల్ పెళ్లి శుభవార్తను మనం విననున్నామన్నమాట. పెళ్లి ముహూర్తం పెట్టాక త్వరలోనే రకుల్ అన్ని విషయాలను ప్రకటిస్తుందని అమన్ అన్నాడు. ప్రస్తుతం ఇద్దరూ తమ ప్రొఫెషన్లలో బిజీగా ఉన్నారని త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకుంటారని అమన్ చెప్పడంతో 2023 లో ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే.. అమన్ ప్రీత్ కన్ఫమ్ చేసిన రకుల్ పెళ్లి న్యూస్ పై రకుల్ కూడా స్పందించింది. అదేంటి నాకు చెప్పకుండానే నా పెళ్లి ఫిక్స్ చేశావా తమ్ముడు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టింది రకుల్.