Rakul Preet Singh : ఇండస్ట్రీలో స్టార్లు కావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో డొక్కామొక్కీలు తినాలి. చాలా కష్టపడాలి. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి. హీరో అయినా హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎంతలా కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తను తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోయిన్ అన్నాక ఆమాత్రం ఆరోపణలు రావా.. వాళ్ల గురించి ఎన్నో విమర్శలు, గాసిప్స్ వస్తుంటాయి. రకుల్ ప్రేమాయణం గురించి కూడా పలు పుకార్లు వచ్చాయి. అయితే.. తన రిలేషన్ షిప్ నిజమే అని ఒప్పుకుంది రకుల్.
మీడియాలో వార్తలు వచ్చాక ఇక దాచుకునేది ఏముందని తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. చాలామంది తమ ప్రేమ వ్యవహారాన్ని తొందరగా బయటపెట్టరు. కానీ.. రకుల్ అలా కాదు.. వెంటనే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అతడు ఎవరో కాదు.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని. ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటున్నామని ప్రకటించింది. ఆ తర్వాత ఇక ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలు పెట్టారు. ఈనేపథ్యంలో తన రిలేషన్ షిప్ గురించి ఎందుకు ఓపెన్ అయ్యిందో తనే చెప్పుకొచ్చింది రకుల్. ఇటీవల తన రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చిన రకుల్.. నేనను నా ప్రేమను బయటపెట్టడానికి ఎందుకు వెనకాడాలి.

Rakul Preet Singh : నా ప్రేమను అందుకే దాచిపెట్టలేదు
నా రిలేషన్ షిప్ గురించి బయటపెట్టేందుకు భయపడేంత పిరికిదాన్ని కాదు. కొందరు తమ ప్రేమను బయటపెట్టేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ.. నేను సినిమాల్లోనే నటిస్తుంటాను. కానీ.. నిజ జీవితంలో నటించలేను. నిజాయితీగా ఉండాలనుకుంటాను. జీవితానికి ఒక తోడు అవసరం. జాకీ, నా అభిప్రాయాలు ఒకటే. భయం వల్ల కొందరు కొన్ని విషయాలు దాస్తుంటారు కానీ.. నాకు ఆ అవసరం లేదు. నాకు భయం లేదు. నా ప్రేమను దాచిపెట్టాలని నేను అనుకోవడం లేదు.. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. తన మాటలను బట్టి చూస్తే త్వరలోనే రకుల్ జాకీతో మూడు ముళ్లు వేయించుకునేలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. రకుల్ సినిమా విషయానికి వస్తే తను నటించిన డాక్టర్ జీ అనే సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం తన చేతిలో థాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి అనే మూడు సినిమాలు ఉన్నాయి.