Ram Charan : చాలా సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ముఖానికి రంగేసుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య లాంటి సినిమాల తర్వాత ఆయన నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం రీమేక్. లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే చాలా హైప్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందు కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినా.. విడుదల తర్వాత సినిమా సంచలనాలను సృష్టించింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.
మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. గాడ్ ఫాదర్ సినిమాను నిజానికి చిరంజీవి చేయొద్దనుకున్నారు కానీ.. కేవలం రామ్ చరణ్ చెప్పాడని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. చివరకు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. గాడ్ ఫాదర్ సక్సెస్ కావడంతో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈనేపథ్యంలో చిరంజీవితో మరో రీమేక్ ను ప్లాన్ చేస్తున్నాడట. మరో మలయాళం సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకున్నాడట.

Ram Charan : గాడ్ ఫాదర్ సక్సెస్ తో రామ్ చరణ్ మరో రీమేక్ కు ప్లాన్
భీష్మ పర్వం అని మలయాళంలో మమ్ముట్టి నటించిన సినిమా అది. ఆ సినిమా గ్యాంగ్ స్టర్ కు సంబంధించినది. గత కొన్ని నెలల క్రితమే మలయాళంలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను ఇటీవల రామ్ చరణ్ చూశాడట. తనకు బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా చిరంజీవికి బాగా సూట్ అవుతుందని రామ్ చరణ్ భావించినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. చిరంజీవి ఈ సినిమాను కూడా చేస్తారా? లేదా? అని.