Ram Gopal Varma : గత కొద్ది రోజులుగా గరికపాటి పేరు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. అందుకు కారణం ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో.. గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని అన్నారు. ఈ ఘటనపై నాగబాబు సహా మెగా ఫ్యాన్స్ గరికిపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అయితే నాగబాబు ఏదో మూడ్ లో అలా అని ఉంటారని ఆయన చేత క్షమాపణలు చెప్పించుకోవడం మా ఉద్దేశం కాదని నాగబాబు ట్వీట్ చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
అంతా సద్దుమణిగింది అనే సమయంలో రామ్ గోపాల్ వర్మ వరుసగా ఆసక్తికర ట్వీట్లు చేశారు. వరుస ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ ‘’ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *తగ్గేదెలె…*’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే ‘’హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు..

Ram Gopal Varma : వర్మ ఫైర్..
నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అంటూ వర్మ దారుణమైన కామెంట్స్ చేశారు. అంతేకాదు ‘’హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి ’’, సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు అంటూ పేర్కొన్నారు. మరి గరికపాటిపై వర్మ అంత ఆగ్రహం వెళ్లగక్కడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది.