RGV- YS Jagan : రాంగోపాల్ వర్మ ఈ పేరు ఒక ప్రభంజనం అని చెప్పాలి. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ ఈయనకు ఉన్న అభిమానులు వేరే లెవెల్. చాలామంది వర్మ లాగా ఒక్కరోజు బ్రతికిన చాలు అనుకుంటారు. ఇలాంటి రోజుల్లో ఎవరి మాట వినకుండా తనకు నచ్చిన విధంగా బ్రతకడం చాలా కష్టం కానీ వర్మకు అది చాలా సులభం. సినిమా విషయాల కంటే వివాదాస్పద మాటలతోనే రాంగోపాల్ వర్మ పాపులర్ అవుతూ వస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వర్మ భయపడడు. బయోపిక్ లు తీసి మరి చమటలు పట్టిస్తాడు. కానీ ఈయన తీసే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎన్ని రోజులు ఆడతాయో ఎవరికీ తెలియదు. ఇటీవల కొండ సురేఖ దంపతులపై వర్మ తీసిన బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అయిందో ఎన్ని రోజులు ఆడిందో ఎవరికి తెలియని పరిస్థితి.
ఇది ఇలా ఉండగా రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లి లోని జగన్ నివాసంలో రహస్యంగా కలిశాడట. అయితే ,రాంగోపాల్ వర్మకుు బయోపిక్ బాగా తీయగలడు అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఇక వర్మకు కూడా జగన్ అంటే మంచి అభిమానం. జగన్ సీఎం అయినప్పుడు ప్రమాణ స్వీకరానికి కూడా ప్రత్యేకంగా హాజరయ్యాడు . జగన్ ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటాడు. జగన్ ప్రత్యర్థి చంద్రబాబు కి వ్యతిరేకంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాను తీసి ఆయనను విలన్ గా కూడా చూపించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ రహస్యంగా కలవడం వెనుక పెద్ద కథే ఉంటుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే జగన్ తాత , రాజారెడ్డి ఒకప్పటి ప్యాక్షనిస్ట్.

అయితే వర్మ రాజారెడ్డి యొక్క బయోపిక్ ను తీసే ప్లాన్ లో ఉన్నాడట. ఇక ఈ సినిమా కోసం జగన్ అనుమతితో పాటు వారి తాత యొక్క కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఇది లీక్ అవ్వకుండా రహస్యంగా వర్మ జగన్ నివాసానికి వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి యాక్షన్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కానీ జగన్ తాత రాజారెడ్డి అప్పట్లో రెబల్ అని పేరు ఉంది. తాత పోలికలే జగన్ కు వచ్చాయని పలువురు అంటుంటారు. మరి అంతటి ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి బయోపిక్ ను వర్మ సినిమాగా తీస్తే తెలుగు రాష్ట్రాలలో సంచలనం ఖాయం.