Rangasthalam : సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ అద్భతంగా నటించి మెప్పించారు. . ఏం మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన సమంత ఫస్ట్ టైం ఈ సినిమాలో గ్లామరస్ లుక్ లో కనిపించింది .ఇందులో సమంత ముద్దు ముద్దు ఎక్స్ ప్రెషన్స్, క్యూట్ క్యూట్ మాటలు, రామ్ చరణ్‌తో రొమాన్స్ అన్ని సమంతకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఈ సినిమాకి సుకుమార్ మొదట హీరోయిన్గా అనుకునింది సమంతను కాదట . మహానటి కీర్తిసురేష్ ని . అయితే ఆ టైంలో కీర్తి సురేష్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో సమంతని తీసుకున్నారట.
అదే సమంత ప్లేస్‌లో కీర్తి సురేష్ నటించి ఉంటే ఈ అమ్మడికి మాములు క్రేజ్ వచ్చేది కాదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో చేస్తోన్న చిత్రం ‘దసరా’ నేచురల్ స్టార్ నాని ( హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేస్తామని ప్రకటించేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల ఆమె చేస్తున్న వెన్నెల అనే క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే అందులో కీర్తి సురేష్ పెళ్లి దుస్తుల్లో నవ్వుతూ చిందులేస్తోంది. అమ్మడి లుక్ క్యూట్‌గా ఉంది.

Rangasthalam : అట్టెట్ట మిస్ చేసుకుంది..
కీర్తి సురేష్‌కు ఈ మధ్య అస్సలు హిట్లు లేవనే చెప్పాలి. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కీర్తి, ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవల స్లిమ్ అయినా కీర్తి సురేష్‌కు మాత్రం పెద్ద ప్రాజెక్ట్స్‌లో చాన్సులు దక్కడం లేదు. తెలుగులో కీర్తి నటించిన పెద్ద సినిమా మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం యావరేజ్‌గా నిలవడంతో పాటు కీర్తికి పెద్దగా పేరు రాలేదు. గుడ్ లక్ సఖి మూవీ అయితే అట్టర్ ప్లాప్ కావడంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు చాన్స్‌లు రావడం కష్టమే అంటున్నారు సినీ జనాలు.