Sudigali Sudheer : బుల్లితెరపై క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు రష్మీ- సుధీర్ జంట. ఈ ఇద్దరూ గత తొమ్మిదేళ్లుగా జనాలను ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఈ ఇద్దరూ ఒక షోలో కనిపించినా, ఇద్దరూ కలిసి ఈవెంట్ చేసినా, ఈ ఇద్దరి మీదే ఈవెంట్ చేసినా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం. ఈ ఇద్దరు టీఆర్పీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అలాంటి జంట ఈ మధ్య ఎక్కడా కూడా కనిపించడం లేదు. మల్లెమాల, ఈటీవీ ప్రోగ్రాంలలో రష్మీ సుధీర్ జంటగా కనిపించడం లేదు. సుధీర్ మాటీవీ వైపు వెళితే, రష్మీ ఈటీవీని పట్టుకు కూర్చుంది. అయితే రష్మీ హోస్ట్ చేస్తున్న షోలలో అప్పుడప్పుడు సుధీర్ పేరు వినిపిస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.
ఢీ షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఎవరి దారి వారు అన్నట్టుగా వేరు వేరు ఛానెల్స్ లో అలరిస్తున్నారు. హోళీకి చేస్తోన్న ఈవెంట్లో సుధీర్ రష్మీ కనిపించారు. ఇక సుధీర్ కోసం చాలా కాలం తరువాత పాటలు పాడాడు. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను మళ్లీ పైకి లేపేశారు. ఇక యాంకర్ రవి అయితే ఈ ఇద్దరి గుట్టులాగేందుకు తెగ ప్రయత్నించాడు. ఇలా ఎవరికి వారు వారిద్దరి మధ్య గుట్టు లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా జబర్ధస్త్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ హైలైట్ గా మారినట్లు చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అవకాశం ఉంటే టైం మెషిన్ ద్వార వెనక్కి వెళ్లి తమ లైఫ్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నారు అని రష్మీ అడుగుతుంది.

Sudigali Sudheer : ఏం జరిగింది..
ముందుగా సన్నీ.. నిన్న మందు కొట్టలేదు నాకు అవకాశం వస్తే వెంటనే వెనక్కి వెళ్ళి మందు కొట్టేసి వస్తాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూస్తాయి.ఇక ఖుష్బూ… 1984లో నేను సినిమా ఇండస్ట్రికి వచ్చాను. అప్పటి నుంచి ఒబెన్ అనే ఆంటీ ఆమెకు హెయిర్ స్టైలిష్ గా ఉండేది. 2011లో ఆమె క్యాన్సర్ తో చనిపోయారని,, ఒకవేళ నాకు అవకాశం వస్తే ఆమెను తిరిగి బ్రతికించుకుంటానని చెప్పడంతో ఒకసారి షో మొత్తం ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత రష్మీ గురించి అడగగా, మేటర్ లోకి ఎంటర్ అయిన గెటప్ శ్రీను నేను చెప్తా నేను చెప్తాను అంటూ ..”సుడిగాలి సుదీర్ రష్మి ఫస్ట్ రొమాన్స్ గురించి బయట పెడతారు. అంతేకాదు 2014 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హార్ట్ సింబల్ చూపిస్తుండగా ..రష్మీ ఓ వైపు సంతోషం మరో వైపు సిగ్గు ..ఇంకోవైపు బాధ తో కలిసిన ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. ఇది అందరిని ఆకట్టుకుంటుంది.