Rashmi Gautham : జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు హవా ఇప్పుడు మాములుగా లేదు.అ వకాశం వచ్చినప్పుడల్లా షోలు చేయడం, అలానే అడపా దడపా సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పచ్చి అందాలు ఆరబోస్తూ.. విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. ఇండస్ట్రీకి పరిచయం అవడానికి ముందే రష్మీ గౌతమ్ మోడలింగ్ రంగంలో మెరిసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలా చాలా ఏళ్ల పాటు టాలీవుడ్లో సందడి చేసింది. ఈ క్రమంలోనే ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి పరిచయమైంది.
ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయిపోయింది. మొదట్లో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన రష్మీ గౌతమ్… గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్గా పలకరించింది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఆతర్వాత హీరోయిన్గా పలు ప్రయత్నాలు చేసింది. అవి పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈ అమ్మడు షోస్‌కి పరిమితం అయింది. రీసెంట్ గా జబర్థస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడం రష్మీకి కలిసి వచ్చింది… ఆ షోబాధ్యతను కూడా రష్మీ మీదనే పెట్టారు మేకర్స్. దాంతో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది. ఇక జబర్థస్త్.. ఎక్ట్రా జబర్థస్త్ రెండు కలిపి ఎపిసోడ్ కు మూడు లక్షల పైనే తీసుకుంటుందట రష్మీ.

Rashmi Gautham : రష్మీ అందాల రచ్చ..
మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తుంది రష్మీ. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. తాజాగా రష్మీ చీర కట్టుఓ వీపు అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ అమ్మడిని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమందంరా బాబు ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా అందాలు ఆరబోస్తూ తీసుకున్న ఫొటోషూట్లను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తెగ హైలైట్ అయిపోతోంది.