Rashmi Gautham : గత కొద్ది రోజులుగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా విషయంలో నందు, రష్మీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో మొదలైన మధ్యలో ఆగింది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ పబ్లిసిటీపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా.. రష్మీని ప్రమోషన్స్‌కి రావాలని చిత్రయూనిట్ ఎంతగా ప్రయత్నించినా.. ఆమె దొరకడం లేదంటూ.. తాజాగా నందు ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో.. ‘‘రష్మీ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. పొగరు చూపిస్తుంది.. అందుకే ఆమె ఫొటోషూట్‌లో పాల్గొంటున్న ప్లేస్‌కి వచ్చాము..’’ అని తెలుపుతూ ఓ వీడియో చేశాడు.
ఇక ఆ వీడియోలో నువ్వు ఎందుకు ప్రమోషన్స్‌కు రావు’’ అంటూ నందు .. రష్మీని ప్రశ్నించాడు. ‘సినిమా గురించి పలు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.. వాటికి నేను సమాధానం చెప్పలేను.. అందుకే రాలేను’ అని రష్మీ చెప్పుకొచ్చింది. తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ నందు చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మీ మాట్లాడుతూ.. ‘‘అది ప్రాంక్ వీడియో కాదు. నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను. అయితే ఈ సినిమా అసలు విడుదలవుతుందో.. లేదో అనే పరిస్థితిలో ఉండగా.. సడెన్‌గా విడుదల అన్నారు. నేను వాళ్లు వచ్చిన టైమ్‌లో వేరే షూట్లో ఉన్నాను.

Rashmi Gautham : ప్రాంక్ కాదు..
సడెన్ గా పిలిస్తే ప్రమోషన్ కు ఎలా వస్తారు.. నా షెడ్యూల్ చూసుకోవాలి కదా..? నేను వేరే షెడ్యూల్ లో ఉంటే వచ్చి విసిగిస్తే ఎలా.. ఛాన్స్ ఉంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు…అంటూ రష్మీ కామెంట్స్ చేసింది. 2 డేస్ ఆగండి వచ్చేస్తా.. అంటే లేదు, వెంటనే రావాల్సిందే.. అంటారు. అందుకే అలా అన్నాను.. ఇది అసలు విషయం’’ అని రష్మీ గౌతమ్ ఈ వీడియోపై వివరణ ఇచ్చింది. మొత్తానికి ఈ చిన్న పనితో సినిమాకి కావల్సినంత ప్రమోషన్ అయితే దక్కింది. మరి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.