Rashmika Mandanna : కన్నడ సోయగం రష్మికా మందన్న బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ నేషనల్ క్రష్‌గా మారిన విషయం తెలిసిందే. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్గా మారింది. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించేది. కాని తర్వాత తర్వాత జోరు పెంచింది. అందాల ఘాటు తట్టుకోతరమా అనేట్టుగా మారిపోయింది. వరుస ఫోటో షూట్లు పిచ్చెక్కిస్తున్నాయి. ఇటీవల ఓ మేగజీన్ కోసం ఆమె తెగించి ఫొటో షూట్ చేసింది. ఆమె ఫొటోలు మత్తెక్కించేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చూపులతోనే మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లని తన కవ్వించే చూపులతో రెచ్చగొడుతుంది.
ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వెళ్లాక ఆమె మరింతగా రెచ్చిపోతుంది. తనలోని యాంగిల్స్ మొత్తాన్ని బయటకు తీస్తుంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ జోరుమీదుంది. ఈ అమ్మడు ఒక్క భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ఇంకోవైపు తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. అందులో `వారసుడు` ఉన్న విషయం తెలిసిందే.

Rashmika Mandanna : దానికే అంత ఖర్చా..
ఇటీవల విక్రమ్ సినిమా నుంచి తప్పుకుంది. అలానే కాంతార సినిమా ఆఫర్ వచ్చిన కూడా తప్పుకుందనే టాక్ వినిపించింది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మికకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో ఆమె నాభి అందాలను చాలా ఆకర్షణీయంగా చూపించేందుకురూ.30 లక్షలు ఖర్చు చేశారట. మైండ్ బ్లాక్ అనే సాంగ్ లో రష్మిక పొట్ట భాగం బాగా ఎత్తుగా కనిపించిందట. దాన్ని అందంగా చూపించేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించారు. వాటికే అంత ఖర్చు అయిందని అంటున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు నోరెళ్లపెడుతున్నారు.