పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కి ఓ మూడేళ్ల చిన్నారి అద్భుతంగా డాన్స్ చేసింది. స్కూల్ డ్రస్‌లో ఉన్న ఆ పాప ఒరిజినల్ సాంగ్‌లోని రష్మిక మాదిరిగా డ్యాన్స్ చేసి అలరించింది .ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి రష్మికను కూడా ట్యాగ్ చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోని వీక్షించిన రష్మిక వెంటనే ఆ వీడియోని షేర్ చేస్తూ.. మేడ్ మై డే… ఈ క్యూట్ బేబీని ఎలాగైనా కలవాలి. ఎలాగో కొంచెం చెప్తారా?’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్స్ కొందరు ఆమె నేపాల్ ప్రాంతానికి చెందినదని, కలవాలంటే నేపాల్‌కి వెళ్లాలని సూచిస్తున్నారు.

Rashmika Mandanna : సూపర్ డ్యాన్స్..
తమిళ నటుడు ఎస్‌జే సూర్య కూడా ఈ వీడియోని వీక్షించి కామెంట్ల వర్షం కురిపించారు. ఆ వీడియోలో చిన్నారి వేసిన స్టెప్పులు చూసి పగలబడి నవ్వేశాడు. ఎంతో క్యూట్‌గా ఉందని ప్రశంసించాడు. అల్లు అర్జున్ సర్.. రష్మిక అంటూ వారిని ట్యాగ్ చేసి.. పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. పాప ట్యాలెంట్‌ను ప్రశంసిస్తూ వేలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ పాప డ్యాన్స్ వీడియోను చూడండి.
Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..💘
how can I? 🥹 https://t.co/RxJXWzPlsK— Rashmika Mandanna (@iamRashmika) September 14, 2022