Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక ఇటీవలి కాలంలో ఎంతగా రెచ్చిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ అందాల ఆరబోతని ఎవరు ఊహించి ఉండరు. నార్త్ హీరోయిన్స్ సైతం ఉలిక్కిపడేలా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంది. ఛలో చిత్రంతో మంచి హిట్ అందుకున్న రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ఆమెకు బాగా ఉపయోగపడింది. శ్రీవల్లిగా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడడంతో రష్మికకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి.
తాజాగా ఆమె నటించిన తొలి హిందీ చిత్రం గుడ్ బై అక్టోబర్ 7న విడుదలైన ఈ మూవీలో రష్మిక మందన్నా యాక్టింగ్ అంతగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కలేదని టాక్ వినిపిస్తోంది. గుడ్ బై చిత్రం ప్రమోషన్స్ లో రష్మిక తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో అందమైన లొకేషన్ లో ఫొటో దిగిన రష్మిక మందన్నా నెట్టింట రచ్చ చేసింది. తాజాగా రష్మిక క్యాప్ పెట్టి థైస్ షో చూపిస్తూ కుర్రాళ్లకి హీట్ పెంచింది.అసలు రష్మికని చూస్తుంటే ఈ అమ్మడేనా ఇది అని అందరి మదిలో మెదులుతుంది.

Rashmika Mandanna : ఏంది ఈ రచ్చ..
అసలు రష్మిక చేస్తున్న ఈ రచ్చని చూసి ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. ఇక రష్మిక టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు ప్రచారం జరిగింది. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల టైమ్లో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని, దీంతో ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారనే చర్చ నడుస్తుంది. పైగా విజయ్ ఇంటికి కూడా పలు మార్లు రష్మిక వచ్చింది. వారి ఫ్యామిలీతో సరదాగా గడిపింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. కాని వారి మధ్య అలాంటివి ఏమి లేవని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.