Rashmika Mandanna : రష్మిక మందన్నా తెలుసు కదా. తన కన్నడ నటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఏలుతోంది. మామూలుగా కాదు. రష్మిక మందన్నా ముందు మోడల్ గా ఈ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడలో పలు సినిమాలు చేసి కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా అయింది. కానీ.. ఆ తర్వాత తనకు తెలుగులో అవకాశాలు రావడం, ఛలో, గీత గోవిందం సినిమాలతో తెలుగులో తనకు స్టార్ స్టేటస్ రావడంతో అతడితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. పుష్ప సినిమాతో తన రేంజే మారిపోయింది. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్. రష్మిక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. తను ఒకవేళ గ్లామర్ ఒలకబోస్తే మాత్రం జనాలు తట్టుకోలేరు. అంత అందంగా ఉంటుంది తను. తను అందాలు ఆరబోసిందంటే ఇక మామూలుకా ఉండదు. రచ్చ రచ్చ చేయాల్సిందే.
Rashmika Mandanna : రంజితమే పాటకు రష్మిక డ్యాన్స్
తాజాగా.. రంజితమే అనే పాటకు రష్మిక డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. ఆ పాటను చూసిన నెటిజన్లు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే.. ఆ పాటకు స్టేజ్ మీద అద్భుతంగా డ్యాన్స్ వేసింది. తను వేసే స్టెప్పులు మామూలుగా లేవు. చీర కట్టి ఎంతో అందంగా ఉన్న రష్మికను చూసి జనాలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏం అందం అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొత్తానికి రష్మిక మందన్నా అందాలకు జనాలు మాత్రం ఫిదా అవ్వకుండా ఉండలేకపోతున్నారు.