Rashmika Mandanna : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన తన అందంతో అభినయంతో కుర్రకారుల మనుషులను కొల్లగొట్టి నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఇక బాషతో సంబంధం లేకుండా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అక్కడ మూడు సినిమాల్లో నటిస్తుంది.దీనిలో భాగంగా గుడ్ బై అనే సినిమాలో నటించింది రష్మిక మందన. అయితే ఈ సినిమా అక్టోబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఈ సినిమా విడుదలకు కొద్దిరోజుల సమయం ఉండటంతో సినీ బృందం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు . ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన స్వయంవరం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఆ షోలోని యాంకర్ ఒకవేళ మీ స్వయంవరం జరిగితే అందులో ఎవరెవరు ఉండాలి అని రష్మీక మందనను అడగగా , ఈ విషయం పై స్పందిస్తూ తను వర్క్ చేసిన హీరోలు అందరూ ఉండాలని సమాధానం ఇచ్చింది .అందులో ముఖ్యంగా రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ ఉండాలి అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. పెళ్లయిన ముగ్గురు స్టార్ హీరోలను తన స్వయంవరంలో ఉండాలని కోరుకుంటుంది రష్మిక.

దీంతో నేటిజనులు తనకి పెళ్లయిన వాడే కావాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కొందరు పెళ్లైన వాడిని చేసుకోవడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ పాస్టర్ సాధించడంతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .ఇక ఇటీవల రిలీజ్ కానున్న గుడ్ బై మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమా కూడా విజయం అందుకుంటే రాష్మిక కు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.