Rashmika Mandanna : విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లైగర్. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, తొలి షో నుండే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఈ సినిమాపై పెదవి విరిచారంటే చిత్రం ఏ రేంజ్ ఫ్లాప్ అనేది అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై రష్మిక పాజిటివ్‌గా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. రష్మికా మందన్న నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7న విడుదల కానుండగా, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక లైగర్ మూవీపై స్పందించింది.
లైగర్ ఘోర్ పరాజయం చెందడంపై మీ కామెంట్స్ ఏంటని ప్రశ్నించాడు రిపోర్టర్. దీనికి స్పందించిన రష్మిక నేను మాస్ సినిమాల ప్రేమికురాలు కావడంతో ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని, విజయ్ నటన నచ్చిందని రష్మిక తెలిపింది. చిత్రం రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండని కూడా కలిసాను అని చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సినిమా కోసం అతను తన బాడీని మలుచుకున్న తీరు అమోఘం అంటూ ప్రశంసలు కురిపించింది. అంత చెత్త సినిమాని ఇంతగా పొగిడింది అంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం నడుస్తుంది. రష్మిక గతంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశితార్థం చేసుకొని విడిపోయింది. ఆ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టిన రష్మిక ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.

Rashmika Mandanna : లైగర్ పై పాజిటివ్ కామెంట్స్..
విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది రష్మిక. ఈ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అప్పట్లో చాలా సార్లు ఈ జంట బయట తిరుగుతూ మీడియాకి చిక్కారు. క్లోజ్ అయి ప్రేమించుకున్నారని, అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు అయి విడిపోయారని చెప్పుకొచ్చారు. విడిపోతే బాగా క్లోజ్ గానే ఉన్నారు కదా అని సందేహం వెల్లడిస్తే ప్రేమలో విడిపోయినా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి ఉండి, ఒకరి కెరీర్ కి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన రష్మిక కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.