బుల్లితెర స్టార్స్ లో హైపర్ ఆది ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈటీవీ వారు చేసే ప్రతి ప్రోగ్రాం లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. సుడిగాలి సుదీర్ వెండితెరపై కాలు పెట్టడంతో ఈటీవీ కి దూరమయ్యాడు. సుధీర్ దూరమయ్యాక ఆది ప్రియారిటి ఇంకాస్త పెరిగిందని చెప్పాలి. మంచి టైమింగ్ లో పంచులు వేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా వెండి తెరపైన అడప తడప సినిమాలు చేస్తూ ఇటు బుల్లితెరపై రానిస్తున్నాడు. అలాగే డీ డాన్స్ షోలో టీమ్ లీడర్ గా చేస్తూ వస్తున్నాడు హైపర్ ఆది.
ఇక డీ సీజన్ 14 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ విచ్చేశారు. వేదిక ఏదైనా సరే తన ఎనర్జన్ మాత్రం ఎక్కడ వదిలిపెట్టరు రవితేజ. ఇక అదే సమయంలో హైపర్ ఆదికి మాస్ రవితేజ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. రవితేజకు డి టీం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. అలాగే కంటెస్టెంట్స్, ఆడియన్స్ పెద్ద ఎత్తుతో ఇలలు వేస్తూ ఆయనను ఆహ్వానించారు. దీంతో ఆపండ్రా అని ఇప్పుడే ఎనర్జీని వేస్ట్ చేస్తే డాన్స్ ఎలా చేస్తారంటూ కంటెస్టెంట్స్ ని ఉద్దేశించి అన్నారు. ఆ తర్వాత రవితేజను చూసిన ఆది మీ గురించి చెప్పడానికి నాకు చాలా అదృష్టం ఉండాలి, మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్నాను సార్ కాని మీతో కలిసి ధమాకా మూవీ లో చేశాను అన్నాడు.

దానికి వెంటనే రవితేజ స్పందించి నేను కూడా మీతో నటించాలనుకుంటున్నానని కౌంటర్ వేశాడు. తర్వాత నాకు తెలియక అడుగుతా అసలు నీకు ఇక్కడేం పని అంటూ హైపర్ ఆదిని ఉద్దేశించి రవితేజ అన్నారు. నీకు ఈ ప్రోగ్రాంకు అసలు ఏ సంబంధం లేదు కదా అని అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆది తల పక్కకు తిట్టుకున్నాడు. అందర్నీ ఆడేసుకుంటావు కదా ఇవాళ నీతో మామూలుగా ఉండదు అంటూ రవితేజ ఆదికి స్వీట్ మార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఆసక్తికర విషయాన్ని ఈటీవీ రిలీజ్ అయిన డీ ప్రోమో ద్వారా తెలిసింది. ఇక రవితేజ మరియు ఆదిల సందడి సంభాషణలు అదిరిపోయే డ్యాన్స్ చూడాలంటే ఢీ షో ని అసలు మిస్ అవ్వకూడదు.