Rashmi Gautham : ర‌ష్మీ నా ఫోన్ ఎత్త‌ట్లేదు.. గీతా మాధురి భ‌ర్త కంప్లైంట్

Advertisement

Rashmi Gautham : రష్మీ గౌత‌మ్.. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు హంగామా మాములుగా లేదు. వ‌రుస షోలు చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. జబర్దస్త్ కామెడీషోతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మీ… కెమెరా ముందు గ్లామరస్ లుక్స్‌తో చిన్నితెర ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడికి పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం ముమ్మాటికీ జబర్దస్త్ ప్రోగ్రామే అని చెప్పాలి. ఈ అమ్మ‌డు గీతా మాధురి భర్త నందు తో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ సినిమా నానుతూ వస్తూనే ఉంది. మొత్తానికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేసుకున్నారు.

Advertisement

నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మాసీ లుక్కులో కనిపించడం, రష్మీ గౌతమ్ కూడా రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది వరకు వదిలిన టీజర్, పాటలు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర హీరో నందు రష్మీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నందు యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో నందు మాట్లాడుతూ.. ‘‘ నేను యూట్యూబ్‌కు వచ్చి మీ అందరితో మాట్లాడటానికి కారణం యాంకర్‌ రష్మీ.

Advertisement
rcomplaint on rashmi gautham
rcomplaint on rashmi gautham

Rashmi Gautham : ఏమైంద‌స‌లు..

ఆమె వల్ల మేము సమస్యల్ని ఎదుర్కొంటున్నాము. రష్మీ మా సినిమా ప్రమోషన్లకు రావట్లేదు. నా ఫోన్‌ ఎత్తట్లేదు. పది నిమిషాలు ఎకధాటిగా కాల్‌ చేసినా ఫోన్ ఎత్త‌డం లేదు. ఇది ర‌ష్మీని బ్యాడ్ చేసే ప్ర‌య‌త్నం కాదు. కాని ఆమె స‌పోర్ట్ చేయ‌డం లేదని తెలియ‌జేసేందుకు ఈ వీడియో చేస్తున్నా అని అన్నాడు. ఇక వీడియెలో ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు.ఎందుకు ప్రమోషన్లకు రావడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదని నిలదీశారు. నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు అంటూ ఇలా వారించింది. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ల కోసం చేస్తోన్న స్టంట్లే అని అర్థమవుతూనే ఉంది.

Advertisement